Thursday, 6 August 2015

జ్ఞానామృతం - 2శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్ కీ జై


ఎన్ని సార్లు శ్రీ సాయి సచ్చరిత్ర ను పారాయణ చెసినా శ్రీ సాయి ను అర్ధం చేసుకోవడం బహు దుర్లభం. శ్రీ సాయి అనుగ్రహానికి పాత్రులవడం చాలా కష్టం. అందుకు కావలసింది నిష్కల్మషమైన హృదయం, నిస్వార్ధ భక్తి, కరుణ, ప్రేమ లతో నిండిన పవిత్రమైన మనస్సు.


1. శ్రీ సాయి పరిశుద్ధ పరిపూర్ణమైన పరబ్రహ్మ అవతారం. త్రిమూర్తి స్వరూపం.సాయిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే. అట్లే దేవతారాధన చేసినా సాయిని ఆరాధించినట్లే. కారణం సకల దేవతా స్వరూపుడు శ్రీ సాయి.

2. శ్రీ సాయిని  ఆరాధించేందుకు ఆడంబరాలతో కూడిన, షొడశోపచార పూజా విధానం అఖరలేదు.భక్తితో ఆయనకు మనస్సు సమర్పించి, సర్వశ్య శరణాగతి చేసి సాయి సాయి అని అను నిత్యం నామస్మరణ చేస్తే చేలు. ప్రేమతో పిలిస్తే తపక వెంటనే పలికే దైవం, సద్గురువు శ్రీ సాయినాధులు.

3. హేమాద్రిపంత్ విరచిత శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ సాయినాధుని దివ్య బాధలొ ఎన్నో నిక్షిప్తమై వున్నాయి. అందుకే శ్రీ సాయి సచ్చరిత్రను నిదానంగా, ప్రతీ పదాన్ని జాగ్రత్తగా చదువుతూ, అర్ధం చేసుకుంటూ , చదివిన దాన్నిని మననం చేసుకుంటూ సాయి తత్వాన్ని మనస్సుకు వంట పట్టించుకోవడం అవశ్యం. ముఖ్యంగా సాయి తత్వం బోధపరచుకోవడం, దానినిని దైనందిన జీవితంలో ఆచరించడం అత్యావశ్యకం..

4. శ్రీ సాయి తెలిపిన శ్రీ గురు చరిత్ర, భగవద్గీత., భారతం, రామాయణం, విష్ను సహస్ర నామం ఇత్యాది సద్గ్రంధాల నిత్య పారాయన సాయి భక్తులకు ఎంతో ముఖ్యం.

5. నాకు అర్పించనిదే ఏమీ  తినని వారికి సదా బాసటగా నిలిచి వారిని రక్షిస్తామన్నారు శ్రీ సాయి. మనం ఆఖరుకు మంచి నీళ్ళు త్రాగే  సమయం లో  కూడా శ్రీ సాయిని తలౌచుకుంటూ సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తూ అంటూ ప్రార్ధిస్తే శ్రీ సాయి దివ్య ఆశ్శీస్సులు మనకు లభిస్తాయి.


సర్వే జనా సుఖినోభవంతు

లోకా స్సమస్తా సుఖినోభవంతు

Wednesday, 5 August 2015

జ్ఞానామృతం - 1శ్రీ గణేశాయ నమ:
శ్రీ సరస్వత్యై నమ:
శ్రీ గురుభ్యో నమ:

శ్రీ సాయి అశేష భక్త జనావళికి నమస్సుమంజలులు. సమర్ధ సద్గురువు, కలియుగ దైవం, భక్తుల పాలిటి కొంగు బంగారం అయిన శ్రీ సాయి దివ్య ఆశ్శీసులతో తిరిగి శ్రీ శిరిడీ సాయి జ్ఞానామృతం అనే ఈ ఆధ్యాత్మిక బ్లాగును ఈ శుభ దినమున ప్రారంభిస్తున్నాను.శ్రీ సాయి దివ్య జ్ఞానామృతమును తోటి సాయి భక్తులతో పంచుకునేందుకు ఈ శుభ సమయము నుండి నా శక్తి వంచన లేకుండా కృషి చేయగలనని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ ఆశీర్వాదములతో పాటు, మీ అమూల్యమైన అభిప్రాయములు, సూచనలను తప్పక అందించగలరని సాయి భక్తులందరికీ నా హృదయ పూర్వక విన్నపములు

నా మెయిల్ ఐ డి   chsairutvik@gmail.com

శ్రీ సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్ గారి పవిత్ర పాదారవిందములకు ఈ భక్తి కుసుమాన్ని సమర్పించుకుంటున్నాను. శ్రీ సాయినాధులు ఈ అద్భుతమైన జీవితాన్ని తన సేవలో వినియోగించుకుంటారన్న ఆశతో వున్న మీ భక్తుడు తనతో పాటు నిష్కల్మష హృదయంతో సాయిని సేవించే భక్తులందరినీ తరింపజెయవలసిందిగా ప్రార్ధిస్తున్నాడు. .