Saturday, 12 August 2017

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 36 
 
శ్రీ సాయినాదులు చెసే దివ్య లీలలకు ఆది, అంతం లేవు. మనకు అదృష్టం వుండ బట్టి హేమాద్రిపంత్ , బి వి నరసింహ స్వామి వంటి మహనీయులు శ్రీ సాయి చేసిన అపూర్వమైన దివ్య లీలలను గ్రంధస్థం చేసి మనకు అందించారు. అందుకనే మనము ఇప్పుడు ఆ లీలలను స్మరించుకోగలుగుతున్నాము. మనం నిత్య జీవితం లో చెసే ఎన్నో ఘోరమైన పాపాలకు నివృత్తి శ్రీ సాయినాధుని లీలలను చదివి, వాటిని మననం చేసుకొని, ఆ దేవదేవుని నామ జపం చెయ్యడమే. ఎన్నో గుడులు, గోపురాలు, మహనీయుల చుట్టూ ప్రదిక్షణ చేసి అలసి, సొలసి , విసిగి వేసారిన వారెందరో చివరకు శ్రీ సాయినాధుని కరుణా కటాక్షాల వలన ఆయన సన్నిధికి చేరి తమ సమస్యలను, చింతనలను దూరం చేసుకొనడమే కాక అధ్యాత్మిక జాగృతిని కూడా పొందిన వారు అనేకులు. ఇప్పుడు సకల సాధు స్వరూపమని తన భక్తులకు తెలియజేసెందుకు శ్రీ సాయి చేన రెండు లీలలను ఇప్పుడు స్మరించుకుందాము.


సాకోరి అనే గ్రామం లో నివసించే హంస రాజు అనే వ్యక్తికి భయంకరమైన ఉబ్బసం రోగం సంక్రమించింది. ఎన్ని డాక్తర్ల చుట్టూ తిరిగి ఎన్ని రకాలుగా వైద్యం చేయించుకున్నా ప్రయోజనం శూన్యం.అంతే కాక దురదృష్త వశాత్తూ వివాహమయ్యి పది సంవత్సరాలయినా అతనికి సంతానం కలగ లేదు. డాక్టర్ల వలన ఏం ప్రయోజనం కలగక పోయేసరికి అతను నాసిక్ లోని ఒక ఆశ్రమం లో వున్న నరసింగ్ మహారాజు అనే ఒక సిద్ధ పురుషుడిని దర్శించి తనను పట్టి పీడిస్తున్న రెండు బాధలను తొలగించమని దీనం గా వేడుకున్నాడు. ఆ సిద్ద పురుషుడు ధ్యానం లో అంతా తెలుసుకొని,పూర్వ జన్మలో ఒక వ్యక్తికి చేసిన హాని కారణం గా ఆ వ్యక్తి హంసరాజు శరీరం లో మరణానంతరం భూతమై ప్రవేశించి అతనిని పట్టి పీడిస్తున్నాదని , ఆ భూతాని వెడల గొట్టే శక్తి తనకు లేదని కనుక శిరిడీలో కొలువై వన్న కలియుగ దైవం , భక్తుల పాలిటి ఆశ్రిత కల్ప వృక్షం అయిన శ్రీ సాయినాధుని శరణు వేడమని సలహా ఇచ్చాడు. ఆ మహరాజు చెప్పినట్లే హంసరాజు 1911 వ సంవత్సరం లో సకుటుంబ సపరివార సమేతంగా శిరిడీ వెళ్ళి శ్రీ సాయిని దర్శించి తన మనసు లోని బాధ చెప్పబోయేంతలో శ్రీ సాయి హంస రాజు చెంపలపై రెండు దెబ్బలు కొట్టి "ఓసి దుష్ట గ్రహమా ? బయటకు పో" అని అరిచారు. తర్వాత కొద్ది సేపటికి శాంతించి " నిన్ను పట్టి పీడిస్తున్న రెండు బాధలు వెంటనే తొలగిపోయాయి, వెళ్ళి హాయిగా జీవించు" అని ఆశిర్వదించారు. బాబా ఆశీర్వాదం ఫలితం గా ఎంతో మంది సుప్రసిద్ద వైద్యు లచే నయం కాని హంస రాజు యొక్క ఉబ్బస రోగం వెంటనే తగ్గి పోయింది.అంతే కాక కొద్ది కలనికే అతనికి సంతానం కలిగింది.

మరొక సంధర్భం లో దహను గ్రామం లో నివసించే హరి భావూ కార్నిక్ అనే సాయి భక్తుడు 1917 వ సంవత్సరం లో గురు పూర్ణిమ నాడు సాయిని దర్శించి, ఆయన ఆశీర్వాదం తీసుకొని మశీదు మెట్లు దిగి వెళుతుండగా సాయిని ఒక రూపాయి దక్షిణ గా ఇస్తే బావుండుననిపించింది.కాని శిరిడీలో నియమం ప్రకారం ఒకసారి బాబా సెలవు తీసుకున్నాక తిరిగి ఆయనను దర్శించరాదని శ్యామా చెప్పడం తో ఇక చేసేది లేక కార్నిక్ నిరుత్సాహం తో తిరిగి వెళ్ళిపోయాడు. అతను నాసిక్ కు వచ్చి కాలా రాముడి ఆలయం లో దర్శనార్ధం ప్రవేసిస్తుండగా ఆ ఆలయం లో భక్తులతో సద్గోష్టి చేస్తున్న నరసింగ మహారాజు ఉన్న పళాన లేచి బయటకు వచ్చి కార్నిక్ చేయి పట్టుకొని " నా రూపాయిని నాకు ఇవ్వు" అని అన్నారు. ఆయన రూపం లో శ్రీ సాయే తాను ఇవ్వదలచుకున్న రూపాయిని స్వీకరిస్తున్నారని ఆనందించిన కార్నీక్ ఎంతో సంతోషం తో ఆ మహరాజుకు రూపాయిని సమర్పించుకొని ఆయన ఆశీర్వాదములను అందుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు కార్నిక్. తన భక్తుల సత్సంకల్పాలను శ్రీ సాయి నెరవేర్చే విధం అపూర్వం , అసమాన్యం, అద్వితీయం.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు
సర్వే జనా సుఖినోభవంతు
"  ఏక గురువు నిశ్చయం అతి ముఖ్యం
గురువారం భక్తులు లేక కొరికల భక్తులు కాకుండా నిస్వార్ధం తో, పుర్ణ హృదయం తో,అచంచల భక్తి శ్రద్ధలతో  సదా కొలిచే భక్తులే సాయికి ఎంతో ప్రీతి. "