Wednesday, 26 September 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 79మానవుడు స్వతాహగా ఇంద్రియాలకు లోబడి జీవిస్తున్నాడు. కలి ప్రభావం వలన ఆత్మ సౌందర్యానికి మాత్రం విలువనివ్వక బాహ్య సౌందర్యాన్ని వీక్షించడానికే అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నాడు. అందువలన తీవ్రమైన కోరికలు జనించి, వాటిని తీర్చుకోవాలన్న తపన మనసులో మొదలౌతుంది. తత్ఫలితం గా జనియించిన చంచలత్వం తో మనసు కళ్ళెం త్రెంచుకున్న గుర్రం వలె స్వాధీనం తప్పి మానవులకు ఎంతో దుఖాన్ని, మనో వేదనను కలుగజేస్తుంది. అటువంటి పరిస్థితి లోనే సాయి భక్తాగ్రేసరుడు నానా చందోర్కర్ వున్నప్పుడు శ్రీ సాయినాధులు విధం గా సంస్కరించి పరమానందాన్ని కలుగజేసారో ఇప్పుడు స్మరించుకుందాం !

ఒక రోజున శిరీడీ లోని మశీదులో నానా చందోర్కర్, శ్యామా, మహల్సాపతి మొదలైన వారు కూర్చొని వుండగా బీజాపూరు నుండి ఒక మహమ్మదీయుడు తన కుటుంబతో వచ్చి శ్రీ సాయికి నమస్కరించాడు. వారిలో ఘోషా స్త్రీలు వుండడంతో భక్తులందరూ లేవబోయారు కాని శ్రీ సాయి వారిని ఫరవలేదని వారించారు. ఒక స్త్రీ తన ముసుగు తీసి శ్రీ సాయికి పాదాభివందనం చేసి తిరిగి తన ముసుగు వేసుకుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుత సౌందర్యం ఆమెది. సూర్యునితో సమానమైన వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా ఆమె ముఖం వెలిగిపోతోంది. అద్భుత సౌందర్యానికి నానా మనసు ఎంతగానో చలించింది. సౌందర్యాన్ని మరల మరల ఆస్వాదించాలన్న కోరిక కలిగింది. అంతే కాక అందం తనకు శాశ్వతంగా స్వంతం అయితే బావుండునన్న కోరిక కూడా కలిగింది. మనసు ఎంతో ఉద్రేకానికి లోనయ్యింది. సాయి సన్నిధిలో కూడా మనసు చలించసాగింది. వెంటనే శ్రీ సాయి నానా చందోర్కర్ శిరస్సుపై చేయిని వేసి గట్టిగా నొక్కి, అపవిత్రమైన భావాలన్నింటినీ అణిచి వేసి నానా ! ఇంద్రియాలను వాటి పనిని స్వేచ్చగా చెసుకోనివ్వు. వాటిలో జోక్యం చేసుకొని అనవసరమైన చికాకులను తెచ్చుకోవద్దు. భగవంతుడు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు. అన్నింటినీ చూసి సంతోషించడం మన విధి. మన మనసులో విధమైన దోషము లేనప్పుడు ఇతరులకు భయపడదం ఎందుకు ?” అని అన్నారు.

శ్యామా, మహల్సాపతిలకు బాబా మాటలు ఏమాత్రం అర్ధం కాలేదు కాని నానా మాత్రం అంతా అర్ధమైనట్లు తలూపాడు. తర్వాత సందేహ నివృత్తి కోసం శ్యామా ప్రశ్నించగ  నానా చందోర్కర్ తాను ముస్లిం మహిళను చూసి చంచలత్వం పొందడం, రగులుతున్న కోరికలను శ్రీ సాయి అణిచివేసిన వైనాన్ని వివరించాడు. శ్రీ సాయి పలులులలోని అంతరార్ధం ను నానా విధం గా శ్యామాకు అర్ధమయ్యెలా చెప్పాడు.మనసు సహజం గా చంచలమైనది. దానికి ఎట్టి పరిస్థితులలోనూ ఉద్రేకం పొందేలా చేయరాదు. ఇంద్రియాలు స్వభావం చేత విషయముల వైపు పరుగులు తీస్తాయి. కాని మనం వాటి వెంట వెళ్ళకూడదు. ధ్యానం ఇత్యాది సాధనాల వలన మనసును, ఇంద్రియాలను స్వాధీనం లో వుంచుకోవాలి. అట్లా కాక ఇంద్రియాలు కోరిన వైపు కళ్ళేం లేని గుర్రం వలె పరుగులు తీస్తే ఇక మిగిలేది దుఖం మాత్రమే ! అందమైన ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు దానిని చూసి ఆనందించేందుకు కళ్ళు కూడా ఇచ్చాడు. మనసులో ఎటువంటి దురాలోచనలు లేకుండా ఎటువంటి సౌందర్యానయినా చూసి హాయిగా ఆస్వాదించవచ్చు. కోరికలు లేక ప్రపంచాన్ని చూస్తే అందులొని అందం మరింత ద్విగుణీకృతమౌతుంది. ఒక్క బాహ్యేంద్రియాలను స్వాధీనం లో వుంచుకొని మనసును విషయానందం వైపు పరుగెత్తనివ్వడం కూడా  చాలా ప్రమాదకరం. వివేకం, వైరాగ్యం, ధ్యానం, సద్గుణములను అలవర్చుకొనుట వంటి సాధనలతో అరిషడ్వర్గములను, ఇంద్రియాలను, మనసును లోబర్చుకొని సాత్వికమైన జీవితమును అవలంబిస్తే మోక్షానికి అర్హులం అవుతాం !

ఆద్భుతమైన బోధను తనివితీరా ఆస్వాదించి అర్ధం చేసుకొని, వంట బట్టించుకొని తమ సమర్ధ సద్గురువైన శ్రీ సాయికి మనసులోనే ప్రణామాలను అర్పించుకొని ఇంటికి బయలుదేరారు శ్యామా, మహల్సాపతిలు.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

Monday, 24 September 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 78శ్రీ సాయినాధునిది ఒక విశిష్టమైన, విలక్షణమైన అవతారం. మిగితా యోగి  శ్రేష్టుల వలె కాక విభిన్నమైన పద్ధతులలో భక్తులను సంస్కరించేవారు. ఆనితర సాధ్యమైన వ్యాధులను చిత్రాతి చిత్రమైన పద్ధతుల ద్వారా నిర్మూలన చేసేవారు. డా : పిళ్ళై నారికురుపు, భీమాజీ పాటిల్ క్షయ వైద్యం, కాక మహాజని యొక్క విరేచనాలను కేవలం నోటి మాటతో తగ్గించి వేసిన వైనం పరమాద్భుతం. ఇటువంటి మరొక విచిత్రమైన సంఘటనను ఇప్పుడు స్మరించుకుందాం.

ఒకసారి శిరిడీ గ్రామం లో కలరా వ్యాధి ఉధృతం గా వచ్చింది.ఎందరో గ్రామవాసులు వ్యాధి బారిన పడసాగారు. రోజులలో సరైన వైద్య సదుపాయాలు లేవు గనుక గ్రామ వైద్యుని వైద్యం మీదనే ప్రజలు ఆధారపడే వారు. ప్రతీ ఇంటిలో కనీసం ఒకరైనా వ్యాధి  బారిన పడసాగారు. అందరూ సాయినే నమ్మి ఆయన నామస్మరణ తొనే జీవితం గడుపుతున్నారు.

ఒకరోజు ఉదయం శ్రీ సాయి నిద్ర లేచి, ముఖ ప్రక్షాళనం చేసుకొని తిరగలి ముందు కూర్చోని శ్రీ సాయి ఇంత ప్రొద్దునే ఎందుకు గోధుమలను విసరడం ప్రారంభించారు ? భిక్షాటనతో జీవించే ఫకీరుకు గోధుమలతో పనేంటి ?” అని అనుకోసాగారు. కొంత సేపటికి శిరిడీ గ్రామమంతటా వార్త వ్యాపించింది. వందల సంఖ్యలో ప్రజలు వచ్చి దృశ్యాన్ని చూడసాగారు.

ఇంతలో నలుగురు స్త్రీలు మశీదు లోనికి వచ్చి బాబాను ప్రక్కకు జరిపి, గోధుమలను తామే విసరసాగారు. బస్తా నిండా గోధుమలు వున్నాయి. బాబాకు ఎలాగూ ఇల్లు, భార్యా, పిల్లలు కుటుంబం లేవు. గోధుమలను విసిరేస్తే పిండిని హాయిగా ఇంటికి తీసుకు వెళ్ళిపోవచ్చు. ఒక నెల రోజుల వరకూ ఇంటి గ్రాసం గురించి ఆలోచించనవసరం లేదు, ఇలా వారి ఆలోచనలు సాగుతున్నాయి.
గోధుమలను విసరడం పూర్తయ్యాక నలుగురూ పిండిని నాలుగు వాటాలు వేసి మూట కట్టుకోసాగారు. అంతవరకూ శాంతం గా జరిగే తంతును గమనిస్తున్న శ్రీ సాయి వెంటనె కోపంతో తల్లుల్లారా ! మీకు పిచ్చి గానీ పట్టిందా ఏం ? మీ వద్ద నేను ఏమైనా అప్పు తీసుకున్నానా ? ఎందువలన పిండిని తీసుకుపోతున్నారు ?” అని అరిచారు. దాంతో స్త్రీలు పిండిని క్రింద వదిలి వేసి సిగ్గుతో లేచి నిల్చున్నారు. వెళ్ళండి. పిండినంతటినీ తీసుకు వెళ్ళి గ్రామం సరిహద్దుల చుట్టూ చల్లండి. కలరా మహమ్మారి గ్రామమంతటా వ్యాపించింది. ఆమె ఎందరినో బలిగొనడానికి ప్రయత్నిస్తోంది. నా భక్తులను బదులుగా పిండిని ఆరగించి సంతుష్టులవమని ఆమెను ఆజ్ఞాపించానుఅని బాబా అన్నారు. మాటలకు అందరూ దిగ్భాంతులయ్యారు. తన భక్తులపై శ్రీ సాయి చూపించే అనిర్వచనీయమైన, ఆవాజ్యమైన ప్రేమకు అందరూ కళ్ళ నీళ్ల పర్యంతరమయ్యారు. వెంటనే పిండిని తీసుకు వెళ్ళి శిరిడీ గ్రామం సరిహద్దు చుట్టూ చల్లారు. అద్భుతం ! వర్ణింప శక్యం గాని విధం గా వెంటనే గ్రామం లో కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. వ్యాధి బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న వారందరూ తక్షణమే స్వస్థులయ్యారు. వ్యాధి నిర్మూలన కొరకు మందుల తయారీలో రేయింబవళ్ళూ కష్టపడుతున్న గ్రామ వైద్యునికి పనే లేకుండాపోయింది. కేవలం భగవంతుదైన శ్రీ సాయి ఆశీర్వాదం వలనే వ్యాధి నిర్మూలింపబడింది. వందలాది ప్రజలు రక్షింపబడ్డారు. కలరా వ్యాధితో అతలాకుతలమౌతున్న శిరిడీ గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరిసాయి. నాటి నుండి సృష్టికే గొప్ప వైద్యుడైన శ్రీ సాయినాధుని శిరీడీ గ్రామ ప్రజలు మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధింపనారంభించారు.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు