Monday, 1 October 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 80



శ్రీ శిరిడీ సాయినాధుల వంటి కలియుగదైవం, సమర్ధ సద్గురువు, పరిశుద్ధ పరమేశ్వర అవతారం యావత్ కలియుగం లో ఇంతవరకూ అవతరించలేదు. ఆయన తన భక్తజనులకు ఇహ,పర విషయాలలో తగిన సూచనలను ఇచ్చి వారు జీవిత పరమావధి పొందేటట్లు చూస్తారు. కొన్ని సంధర్భాలలో తన అభయ హస్తాన్ని భక్తుల తలపై వుంచి తన యోగ శక్తిని వారిలో ప్రవహింపజెసి వారికి అనిర్వచనీయమైన అధ్యాత్మికానుభూతిని కలుగజేసేవారు. ఫలు సంధర్భాలలో భగవంతుని లీలలు కంటే భగవధ్భక్తుల లీలలను కీర్తించేవారు గొప్ప అని తెలియజేస్తుండే వారు.

మహారాష్త్రలో దహను పట్టణం లో బి వి దేవ్ అనేవారు మామల్తదారుగా వుండేవారు.అతని తల్లి కుటుంబ సభ్యుల మంచి కోసం 30 నోములను చేసి వాటికి ఒకేసారి ఉద్యాపన  చేయ సంకల్పించింది. శుభ కార్యం లో 300 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్ట సంకల్పించి సుమూర్తం నిశ్చయించారు. కార్యం కోసం దేవు బాబాకు అనుమతి కోరుతూ ఒక ఉత్తరం వ్రాసి చివరగా తన ఇంటికి వచ్చి భోజనం చేయవల్సిందిగా ఆహ్వానించాడు. బాపూసాహెబ్ జోగ్ వుత్తరం చదివి వినిపించగా చిరునవ్వుతో శ్రీ సాయి నా భక్తుల ప్రేమ నాకు ఎల్లప్పుడూ కావాలి ! నన్నే మన:పూర్వకం గా గుర్తుంచుకునేవారిని నేను  కలలో నైనా మరువను. భక్తులకు సర్వదా ఆనందాన్ని ఇవ్వడమే నా కర్తవ్యం. మనం ముగ్గురం కలిసి సంతర్పణకు హాజరవుతామని భావూకు వుత్తరం వ్రాయు !అని అన్నారు. వుత్తరం చదివి దేవ్ ఎంతో ఆనందించాడు. సాక్షాత్ భగవంతుడు తన ఇంటికి వచ్చి తన ఆతిధ్యం స్వీకరిస్తున్నాడంటే అంతకంటే అద్భుతమైన విషయం ఇంకేమి వుంటుంది ?

ఉద్యాపనకు కొద్ది రోజుల ముందు ఒక బెంగాలీ సన్యాసి దహను స్టేషను మాస్టర్ వద్దకు వచ్చి తాను చేపట్టిన గోసంరక్షణార్ధం చందాను ఇవ్వవలిందిగా అభ్యర్ధించాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బి వి దేవ్ సన్యాసితో ఊరిలో ప్రస్తుతం మరొక చందాల పట్టీ నడుస్తున్న కారణం గా మూడు నెలల తర్వాత తిరిగి రమ్మని సూచించాడు.

ఉద్యాపన రోజున సరిగ్గా 10 గంటలకు సన్యాసి ఒక టాంగాలో ఇంటి ముందు దిగగా అతను చందాలను వసూలు చేసే మిషతో వచ్చాడేమోనని దేవ్ భావించాడు. ఆతని మనోభావాలను గ్రహించిన సన్యాసి తాను చందాల కోసం రాలేదని, అన్న సంతర్పణ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు వచ్చానని చెప్పాడు. భి వి దేవ్ ఎంతో సంతోషం తో రండి ! ఇల్లు మీదిగా భావించి విశ్రాంతి తీసుకోండి. పన్నెండు గంటల కల్లా మొదటి భోజన పంక్తి ప్రారంభమౌతుంది.ఆని అన్నాడు. అందుకు సన్యాసి నాతో పాటు ఇంకా ఇద్దరు వున్నారు. మేమందరం పన్నెండు గంటల కల్లా వస్తాం !అని వెళ్ళిపోయాడు. తిరిగి పన్నెండు గంటలకు ఇద్దరి శిష్యులతో వచ్చి తృప్తిగా విందారగించి దేవ్ ను, అతని తల్లిని అశీర్వదించి వెళ్ళిపోయాడు.

తర్వాత దేవ్ బాబాకు చెప్పిన విధంగా రానందుకు తాను ఎంతో బాధ పదుతున్నానని, బాబా తన విషయం లో మాట తప్పారని ఎంతో నిష్టూరం గా వుత్తరం రాసాడు. జోగ్ వుత్తరం తెరవక ముందే బాబా చిరునవ్వుతోదేవ్ ఎంతో నిష్టూరం గా లేఖ రాసాడు. అందులో ఆడిన మాత తప్పానని నాపై అభాంఢాలు వేసాడు. ఛెప్పిన విధం గా ముగ్గురు వెళ్ళి ఆయన ఇంట్లో భోజనం చెయ్యలేదా ? బెంగాలీ సన్యాసి రూపం లో వున్న నన్ను పోల్చుకోలేకపోయాడు. భక్తులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేందుకు నేను నా ప్రాణాలనైనా ఇస్తాను.అని అన్నారు. బాబా సమాధనాన్ని దేవ్ కు జోగ్ వుత్తరం ద్వారా తెలియపరచగా దానిని చదివిన దేవ్  ఆనందంతో కళ్ళ నీళ్ళ పర్యంతరమయ్యాడు. బాబా వంటి సద్గురువును తొందరపాటుతో నిందించినందుకు పశ్చాత్తాపపడ్డాడు. తాను ఆహ్వానించకపోయినా సన్యాసి భోజనం సమయానికి బాబా వ్రాసినట్లు ఇద్దరితో రావడం గుర్తించలేనందుకు సిగ్గుపడ్దాడు. బాబా చెసిన అద్భుతమైన లీలకు ముదమొంది మనసులోనే కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకున్నాడు.

భక్తులు తమ సద్గురువును అనన్య చింతనతో, పూర్ణ భక్తితో సర్వస్య శరణాగతి చేసినచో ఆయన అనుగ్రహం వలన తాము సంకలించిన కార్యములన్నింటినీ నిర్విఘ్నంగా నెరవేరుతాయన్న నగ్న సత్యం లీల వలన అందరికీ అవగతమయ్యింది.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు