Saturday, 9 February 2019

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 100


సద్గురు శిష్యులు :

మనంబుచ్చావది వెంకటసుబ్బయ్యర్ సద్గురు త్యాగరాజ స్వామి శిష్యులలో ప్రధముడు, అగ్రగణ్యుడు. ఆయన త్యాగరాజస్వామికి తమ్ముడు వరుస కూడా అవుతారు. చిన్ననాటి నుండే సంగీత, సాహిత్యాలలో ఎనలేని కృషి చేసి అందరి మన్ననలను పొందారు. ఈయన వయొలిన్, మృదంగ విద్యలలో కూడా మంచి ప్రావీణ్యం సాధించారు.సద్గురు త్యాగరాజస్వామితో అందరి శిష్యుల కంటే అత్యధిక సమయం గడిపిన పుణ్యాత్ములు. త్యాగరాజస్వామి కీర్తనలకు పాడిన స్వరాలను గుర్తుంచుకొని, అనంతరం కావేరీ నదీ తీరం లో బహు జాగ్రత్తగా రాసి భద్రపరచి భవిషత్ తరాలకు అందించిన ధన్యజీవి. యావత్ సంగీత ప్రపంచం వెంకట సుబ్బయర్ గారికి ఋణపడి వుంటుంది. గురువు సమాధి అనంతరం తిరువయ్యూర్ లో ఒక సంగీత కళాసాలను స్థాపించి ఎందరో శిష్య ప్రశిష్యులకు సంగీతం లో శిక్షణ ఇచ్చి గురువుకు తగిన శిష్యుడు అనిపించుకున్నారు. ఆయన శిష్యులలో ముఖ్యులు మహావైద్యనాధన్ శివన్, పట్నం సుబ్రమణ్య అయ్యర్, సరభ శాస్త్రిగళ్ వంటివారు.ఈయన హంసధ్వని రాగం లో జలజాక్ష వంటి అసంఖ్యాక వర్ణాలను రచించారు. త్యాగరాజ స్వామి పై దేవగాంధారి రాగం లో స్వామికి సరి అనే కీర్తన బహుళ ప్రాచుర్యం పొందింది. ఈ కీర్తన అంతే త్యాగరాజ స్వామికి ఎంతో ఇష్టం అని చెబుతారు. స్వామి తరచుగా ఈ కీర్తనను పాడేవారని చరిత్రకారుల ఉవాచ. 

No comments:

Post a Comment